ఎంఆర్ఐ లో ఘనంగా మహిళా దినోత్సవం
విశ్వంభర, అనంతపురం: యన్ ఆర్ ఐ అంతర్జాతీయ జూనియర్ కళాశాల లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆడంబరంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ శ్రీమతి బల్లా పల్లవి, యన్ ఆర్ ఐ విద్యాసంస్థల ఛైర్మన్ వెన్నపూస విశ్వనాథ్ రెడ్డి మరియు అతిథిగా శ్రీ షేక్ ఇంతియాజ్, యన్ ఆర్ ఐ రాష్ట్ర సెక్రెటరీ అబ్దుల్ ఆలం పాల్గొన్నారు. వారు మా విద్యార్థినులు మరియు మహిళా సిబ్బందికి ప్రేరణాత్మక సందేశాలను అందించారు, మహిళలు విశ్వాసం, ధైర్యం సంకల్పంతో నాయకత్వం లక్షణాలను పెంపొందించుకోవాలని సూచించారు.యన్ ఆర్ ఐ విద్యా సంస్థలలో, మహిళలకు విద్య మరియు సాధికారత కల్పించడం ప్రగతిశీల సమాజాన్ని నిర్మించడానికి పునాది అని మేము విశ్వసిస్తున్నాము అని తెలిపారు. మహిళా ఉద్యోగులను గుర్తించి గౌరవించినందుకు యన్ ఆర్ ఐ విద్యా సంస్థల యాజమాన్యాన్ని ఆమె ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీమతి దివ్య రెడ్డి, యం డి శ్రీ చంటి రెడ్డి, డైరెక్టర్ శ్రీమతి అనుషా రెడ్డి, పి ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ ఆలం, ప్రతిభా భారతి, ఏ పి ఎస్ ఆఫ్ నాయకులు నరసింహ మరియు నిరంజన్ పాల్గొన్నారు.



