గోవంశ పరిరక్షణకు కోడెదూడల సంరక్షణే మూలం : పగుడాకుల బాలస్వామి
విశ్వంభర, వేములవాడ : వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధానంలో విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర బృందం ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారిని దర్శించుకుంది. అనంతరం ఆలయ సంప్రదాయాన్ని, గోసంస్కృతిని ప్రతిబింబించే కోడెదూడల సమర్పణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించింది. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ధర్మాచార్య సంపర్క ప్రముఖు పగుడాకుల బాలస్వామి మాట్లాడుతూ.. భారతీయ సనాతన సంప్రదాయంలో గోవుకు విశిష్ట స్థానం ఉందని పేర్కొన్నారు. కోడెదూడల సంరక్షణ ద్వారా వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ, గోవంశ పరిరక్షణకు ప్రాధాన్యం లభిస్తుందన్నారు. ఇది నేటి సమాజానికి అత్యంత అవసరమని ఆయన వివరించారు. గోవంశ పరిరక్షణ అనేది భారతీయ సంస్కృతి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ప్రకృతి సమతుల్యతతో ముడిపడి ఉన్న గొప్ప బాధ్యత అని తెలిపారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి, కార్యాలయ కార్యదర్శి జగదీశ్వర్ జి, మాతృ శక్తి రాష్ట్ర కోకన్వీనర్ శ్రీవాణి, దుర్గా వాహిని రాష్ట్ర కన్వీనర్ వాణి సక్కుబాయి, దుర్గా వాహిని మహానగర కన్వీనర్ మాధవి , రాజు, కార్యవర్గ సభ్యులు, జిల్లా బాధ్యులు, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.