గిన్నిస్ రికార్డు హోల్డర్ రిత్విక్‌కు సన్మానం

విశ్వంభర, సోమాజిగూడ :హైదరాబాదు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఇటీవల కరాటేలో గిన్నిస్ రికార్డు హోల్డర్ మన్నే రిత్విక్ ముదిరాజ్‌ను ప్రముఖ సినీ నటుడు సుమన్ తల్వార్ ప్రత్యేక అవార్డుతో సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రధాని శ్రీనివాస్ గౌడ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలంగాణ చైర్మన్ టీవీ అశోక్, తెలంగాణ సినీ ఫైట్ మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రవికుమార్ రిత్విక్‌ను అభినందించి శాలువా, జ్ఞాపిక, అభినందన పత్రం అందజేశారు. చిన్న వయస్సులోనే గిన్నిస్ రికార్డు సాధించడం అభినందనీయమని, యువత క్రమశిక్షణ, పట్టుదలతో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రాండ్ మాస్టర్ పోచయ్య, కరాటే మాస్టర్లు, క్రీడా ప్రముఖులు, సినీ రంగ ప్రతినిధులు పాల్గొన్నారు

🕒 27 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/tribute-to-guinness-record-holder-ritwik/article-19818

Tags: