ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యే లక్ష్యం
సూర్యాపేట జెడ్పీహెచ్‌ఎస్‌లో డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించిన కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
పాఠశాల అభివృద్ధికి రూ.10 లక్షలు.. త్వరలోనే విద్యార్థులకు ఉచిత అల్పాహార పథకం
విశ్వంభర, సూర్యాపేట: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నత స్థానాలకు చేరేలా కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. శనివారం సూర్యాపేటలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్‌ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మారుతున్న సాంకేతిక యుగానికి అనుగుణంగా విద్యార్థులకు డిజిటల్ విద్యను చేరువ చేయడం అత్యవసరమని అన్నారు. తాను ఏడో తరగతిలో ఉన్నప్పుడు తొలిసారి కంప్యూటర్ చూసానని, ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చిన్న వయసులోనే డిజిటల్ టెక్నాలజీతో పరిచయం అవుతున్నారని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టీ-ఫైబర్, ఏఆర్/వీఆర్ ల్యాబ్‌ల ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గ్లోబల్ స్థాయి కోడింగ్ విద్య అందిస్తున్నామని, 6 నుంచి 9వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక డిజిటల్ లెర్నింగ్ పుస్తకాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు.
పాఠశాల అభివృద్ధికి రూ.10 లక్షల నిధులు
సూర్యాపేట జెడ్పీహెచ్‌ఎస్‌లో గతేడాది పదో తరగతి ఫలితాలు మెరుగ్గా రావడంతో పాటు మౌలిక వసతులు అభివృద్ధి చెందడంతో ఈ విద్యా సంవత్సరంలో 121 మంది కొత్త విద్యార్థులు చేరారని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఈ ఒక్క ఏడాదిలోనే 10,113 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా చేరడం ఆనందదాయకమన్నారు. పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ అభినందిస్తూ, మౌలిక వసతుల కల్పన కోసం వెంటనే రూ.10 లక్షల నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. స్వచ్ఛంద సంస్థలు, ఉపాధ్యాయులు, ప్రజల సహకారంతో ఈ పాఠశాలను జిల్లాలోనే ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.
త్వరలోనే ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం
విద్యార్థుల ఆరోగ్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇప్పటికే నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని, త్వరలోనే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి ఉదయం ఉచిత అల్పాహార పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఆరోగ్యవంతమైన శరీరంతోనే విద్యార్థులు విద్యలో రాణించగలరని, పరిశుభ్రత పాటిస్తూ ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు.
చదువే పేదరికాన్ని జయించే ఆయుధం: పటేల్ రమేష్ రెడ్డి
రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ, పేదరికాన్ని జయించి సమాజంలో గౌరవప్రదమైన స్థానం సంపాదించాలంటే చదువే ఏకైక మార్గమని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు.ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేయడానికి జిల్లా కలెక్టర్ చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన కొనియాడారు. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ పాఠశాలను దత్తత తీసుకొని మోడల్ స్కూల్‌గా తీర్చిదిద్దుతానని ఇచ్చిన హామీ మేరకు పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
డిజిటల్ బోర్డులు, డెస్క్ బెంచీలు, సైన్స్ ల్యాబ్
పాఠశాల విద్యార్థుల కోసం హెచ్‌డీఎఫ్‌సీ సహకారంతో డ్యూయల్ డెస్క్ బెంచీలు ఏర్పాటు చేయడంతో పాటు, వారం రోజుల్లో సొంత నిధులతో డిజిటల్ బోర్డులను అందుబాటులోకి తీసుకువస్తామని రమేష్ రెడ్డి హామీ ఇచ్చారు. అదేవిధంగా సైన్స్ ల్యాబ్, డైనింగ్ హాల్, పాఠశాల బెల్ తదితర సౌకర్యాలను కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్‌లు, స్కూల్ బ్యాగులు, యూనిఫాంలు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, ఏఎంసీ వైస్ చైర్మన్ జి. శ్రీనివాస్ రావు, మున్సిపల్ కౌన్సిలర్ వెంకన్న, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, మండల విద్యాశాఖ అధికారి శేషగాని శ్రీనివాస్ గౌడ్, ప్రధానోపాధ్యాయురాలు పద్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.