కన్నుల పండువగా అంబర్‌పేటలో మహంకాళి ఘటం ఊరేగింపు

విశ్వంభర, అంబర్‌పేట : అంబర్‌పేటలో మహంకాళి అమ్మవారి ఘటం ఊరేగింపుతో బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మోర పండిత్ ముదిరాజ్ ఘటాన్ని తలపై ఎత్తుకొని భాజా భజంత్రీల నడుమ ఊరేగింపుగా తీసుకెళ్లారు. మహంకాళి దేవాలయం వద్ద ప్రారంభమైన ఘటం ఊరేగింపు బొడ్రాయి వరకు భక్తుల జయజయధ్వానాల మధ్య కొనసాగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. సికింద్రాబాద్ జోన్ అదనపు కమిషనర్ జే. నరసయ్య పర్యవేక్షణలో అంబర్‌పేట ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అంబర్‌పేట దేవస్థాన సేవా సమితి ప్రతినిధులు వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు

🕒 27 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mahankali-ghatam-procession-in-amberpet-as-festival-of-eyes/article-19893

Tags: