10వ తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు - బీసీ సేన మండలాధ్యక్షులు బండ అజయ్ కుమార్*

10వ తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు - బీసీ సేన మండలాధ్యక్షులు బండ అజయ్ కుమార్*

విశ్వంభర, షాబాద్:పదవ తరగతి వార్షిక పరీక్షలు రాస్తున్న విద్యార్థినీ, విద్యార్థులకు బీసీ సేన మండలాధ్యక్షులు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఎలాంటి భయాందోళనలు లేకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని సూచించారు. కష్టపడి చదివిన విద్యార్థులు తమ ప్రతిభను చాటుకొని మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని బండ అజయ్ కుమార్ కోరారు.

Tags: