ఇనుగుర్తిలో బిజెపి రాస్తారోకో
- నీట్ సాకుగా చూపుతూ అల్లర్లు సృష్టిస్తున్నారు
- బిజెపి జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు
విశ్వంభర, ఇనుగుర్తి: బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, మానుకోట ఇంచార్జ్ కళ్యాణ్ నాయక్ ప్రభృతులను రాష్ట్ర ప్రభుత్వం చేసిన అక్రమ అరెస్టులకు నిరసనగా మండల కేంద్రం ఇనుగుర్తి లో బిజెపి మండల శాఖ అధ్యక్షులు దుంపల సందీప్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు గురువారం ధర్నా రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకోలో బిజెపి జిల్లా అధ్యక్షులు వల్లబు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.ప్రధాన రహదారిపై బిజెపి శ్రేణులు బైఠాయించి రాహుల్ గాంధీకి, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.దీంతో వాహన ప్రయాణికులకు అంతరాయం కలగడంతో స్థానిక ఎస్సై కరుణాకర్ ఆధ్వర్యంలో పోలీసులు జోక్యం చేసుకొని బిజెపి నాయకులతో మాట్లాడి ఆందోళన విరమింప చేశారు. అంతకు మునుపు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు వల్లబు వెంకటేశ్వర్లు హాజరై మాట్లాడుతూ సీజేపీ,కాంగ్రెస్ లు నీట్ లీక్ ను సాకుగా చూపిస్తూ దేశంలో అల్లర్లు సృష్టించి కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని కుట్రపన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ పరీక్షా లీకైన తర్వాత బాధ్యులను జైల్లో వేసి మళ్లీ పరీక్ష నిర్వహించి ఫలితాలు సైతం వచ్చిన అనంతరం చాలా రోజులకు నీట్ పై లొల్లులు సృష్టించడమేంటన్నారు. పార్లమెంటు,ప్రధాని నివాసం ముందు ధర్నాలు నిర్వహించడం ఇందులో భాగమేనని దుయ్యబట్టారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ ప్రపంచ స్థాయిలో కీర్తి ఇనుమడించడం జీర్ణించుకోలేని శక్తులు కుయుక్తులు పన్ని అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం బిజెపి చీఫ్ రామచంద్రరావును, మానుకోట ఇంచార్జ్ కళ్యాణ్ నాయక్ తో పాటు పలువురు నేతలను అరెస్టు చేయడం దారుణం అన్నారు.కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర,జిల్లా,మండల,వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.