కల్వకుర్తి ఎమ్మెల్యే కు బిజెపి నాయకుల వినతి పత్రాలు

19

 తెలంగాణ పత్రిక ప్రతినిధి, ఆమనగల్లు, జులై 11:- ఆమనగల్లులో ప్రభుత్వ వైద్యశాల ప్రారంభానికి బుధవారం వచ్చిన కల్వకుర్తి  ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కి బిజెపి నాయకులు విడి విడిగా వినతి పత్రాలు అందజేశారు నాలుగు సంవత్సరాల కింద ఆమనగల్లులో సొంత భవనం లేక గురుకుల పాఠశాలను తరలించి షాద్నగర్ మండలంలో కొనసాగిస్తున్నారు సొంత భవనాన్ని నిర్మించి ఆమనగల్లు కు గురుకుల పాఠశాలను తీసుకురావాలని బీజేవైఎం సీనియర్ నాయకులు రేవల్లి రాజు వినతి పత్రం అందజేశారు కాగా తలకొండపల్లికి చెందిన పోతుగంటి మహేష్ మండలంలో బీటీ రోడ్లు నిర్మించాలని, కాలేజీకి సొంత భవనం నిర్మించాలని, రోడ్డు విస్తరణ పనులు తొందరగా చేపట్టాలని మరో వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఎడవల్లి  మహేష్,రేవల్లి వెంకటేష్ తదితర బిజెపి నాయకులు పాల్గొన్నారు

Read More హన్వాడ విగ్రహావిష్కరణకు బయలుదేరిన షాద్ నగర్ ముదిరాజ్ నాయకులు అభిమానులు