భూకబ్జాదారుల నుండి ప్రాణ రక్షణ కల్పించండి : బాధితురాలు స్వరూప
విశ్వంభర, హనుమకొండ: హసన్ పర్తి మండలం అనంతసాగర్ రెవెన్యూ శివారు లోని 74/బీ,73/ఏ/1,77/ఏ/1,78/బి,సర్వే నంబర్ లో మొత్తం 4.03 ఎకరాల భూమి ఉంటుందని, అందులో ఒక ఎకరం 6గుంటల భూమి అనంత సాగర్ గ్రామానికి చెందిన వైద్యుల సమ్మిరెడ్డి, స్వరూప దంపతులకు చెందిన భూమి ఉంది . ఆ భూమిని కాజేయడానికి అదే గ్రామానికి చెందిన భూకబ్జా దారులు వైద్యుల ప్రతాప్ రెడ్డి, వైద్యుల తిరుపతి రెడ్డి, ప్రమీల, ఇతర కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారని, ఆ భూమిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను,హసన్ పర్తి మండలం సర్వేయర్ వచ్చి హద్దులు ఏర్పాటు చేసి కనీలు పాతిన వాటిని ధ్వసం చేశారని బాధితురాలు స్వరూప మీడియా ముందు ఆవేదనతో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ చెప్పారు. తన అత్తమామల నుండి నా భర్త సమ్మిరెడ్డికి, తనకు భూమి మార్పిడి జరిగిందని అప్పటి నుండి మాకు తెలంగాణ పాస్ బుక్ వచ్చిందని, రైతు బంధు డబ్బులు తమ ఖాతాలో పడుతున్నాయని ఆమె తెలిపారు. జనవరిలో తన భూమి వద్ద ఉండగా ప్రతాప్ రెడ్డి, తిరుపతి రెడ్డి, ప్రమీల వచ్చి తనపై దాడి చేయగా హసన్ పర్తి పోలీసు స్టేషన్ లో కేసు పెట్టినట్లు తెలిపారు. హసన్ పర్తి పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకుని మా కుటుంబానికి ప్రాణహాని కలుగకుండా, మా భూమిని కాపాడాలని మీడియా పరంగా విజ్ఞప్తి చేశారు. అంతేగాక జిల్లా కలెక్టర్, ఆర్డీవో, హసన్ పర్తి మండల రెవెన్యూ అధికారులు వంశపారంపర్యంగా వస్తున్న మా భూమిని భూకబ్జా కోరుల నుండి రక్షించాలని వేడుకున్నారు.