అంకితభావమే నాయకత్వానికి ఆదర్శం: వెంకయ్య నాయుడు
విశ్వంభర, చిక్కడపల్లి : అంకితభావం, నీతి, నిబద్ధత కల నాయకత్వం తగ్గిపోతూ తిట్ల రాజకీయాలు పెరుగుతున్నాయని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. పార్టీలకు అతీతంగా సిద్ధాంత నిబద్ధత కల నాయకులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. హైదరాబాదు చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలో రసమయి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు టి.డి. జనార్ధన్కు ఎన్టీఆర్ పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, సిద్ధాంత భేదాలు ఉన్నప్పటికీ కమ్యూనిస్టు నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి పట్ల ఉన్న గౌరవంతో ఆయన భౌతికకాయాన్ని సందర్శించానని చెప్పారు. ఎన్టీఆర్ పదవుల కోసం కాకుండా నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసిన నాయకుడని, తెలుగు భాష, తెలుగు జాతి గౌరవం కోసం కృషి చేశారని, పేదలు, మహిళల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, ఎన్టీఆర్ తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేత అని కొనియాడారు. ప్రజల సంక్షేమానికి పలు సంస్కరణలు అమలు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో: రసమయి వ్యవస్థాపకుడు డాక్టర్ ఎం.కె. రాము తెలుగువన్ వ్యవస్థాపకుడు రవిశంకర్ ఆదాయపన్ను శాఖ విశ్రాంత సంచాలకుడు నరసింహప్ప డాక్టర్ వేణుగోపాలాచారి పాల్గొన్నారు.