బీసీ బంద్ విజయవంతం - రాపోలు జ్ఞానేశ్వర్
42% రిజర్వేషన్స్ అమలు అయ్యేవరకు ఉద్యమం ఆగదు.- కొండా లక్ష్మణ్ బాపూజీ గ్లోబల్ ఫెడరేషన్
On
విశ్వంభర, హైదరాబాద్ :- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 42% బీసీలకు రిజర్వేషన్లు (కామారెడ్డి డిక్లరేషన్) హైకోర్టు 50% మించరాదని చెబుతూ 42 శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బీసీలు అందరూ జేఏసీగా ఏర్పడి బీసీల హక్కులను, 42 శాతం రిజర్వేషన్లు సాధించుకునేందుకు జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు కొండా లక్ష్మణ్ బాపూజీ గ్లోబల్ ఫెడరేషన్ మద్దతు ప్రకటించింది. బొటానికల్ గార్డెన్ కొండాపూర్, లింగంపల్లి బస్ డిపో వద్ద బంద్ కార్యక్రమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఫెడరేషన్ చైర్మన్ రాపోలు జ్ఞానేశ్వర్, జాక్ నాయకులు సగర రాష్ట్ర సంఘం అధ్యక్షులు శేఖర్ , మాజీ కార్పొరేటర్ , టి ఆర్ ఎస్ నాయకులు కొమిరెశెట్టి సాయిబాబా , బీజేపీ శేరిలింగంపల్లి నాయకులు రవి కుమార్ పాల్గొని బంధు కార్యక్రమాన్నివిజయవంతం చేశారు. బీసీలందరం ఏకతాటిగా ఉద్యమాలను నిర్మిస్తూ 42 శాతం రిజర్వేషన్లు సాధించేంతవరకు పోరాటాలను కొనసాగించాలని ఇంకా వివిధ రూపాలలో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని విద్యా ఉద్యోగ రాజకీయాలలో 42 శాతం సాధించేంతవరకు అన్ని బీసీ సంఘాలు ప్రజాసంఘాలు ఉద్యమ సంఘాలు మహిళా సంఘాలు విద్యార్థి, ఉద్యోగ ఉపాధ్యాయ సమస్త సంఘాలు పాల్గొని ఈ రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే అఖిలపక్షాన్ని సమావేశ పరుస్తూ అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి కేంద్ర కేంద్ర ప్రభుత్వం దగ్గర రానున్న శీతాకాల సమావేశాలలో ఏర్పాటు చేసే రక్షణ పొందే విధంగా బిజెపి నాయకులను, పార్టీల ఎంపీలను ఎమ్మెల్యేలను విజ్ఞప్తి చేస్తూ నిలదీస్తూ రానున్న శీతాకాల సమావేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకుగాను ఏకతాటి పైకొచ్చి సాధించేంతవరకు విశ్రమించబోమని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొరకు ఎలాగైతే ఉద్యమించామో బీసీ లందరూ కూడా రాష్ట్రంలో ఉన్న రెండున్నర కోట్ల బీసీ సమాజం, యావత్ సమాజం ఈ ఉద్యమంలో పాల్గొని సాధించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేస్తూనే కార్యక్రమాల రూపకల్పన చేసి గ్రామస్థాయి వరకు ఉద్యమాన్ని నిర్మించాలని రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేలా కార్యక్రమాలు చేస్తూ 9వ షెడ్యూల్లో పెట్టే విధంగా మన కార్యక్రమాలు చేపట్టాలని అందరము ఏకతాటిపైకి వచ్చి తెలంగాణ ఉద్యమం ఎలాగైతే సాధించుకున్నామో అలాగే సామాజిక న్యాయం, బీసీలకు అధికారం, బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయలలో 42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకుగాను అందరము కృషి చేయాలని కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయమైన సామాజిక న్యాయం, సాధికారత సాధించేవరకు కొండా లక్ష్మణ్ బాపూజీ ఫెడరేషన్ పోరాటాలు చేస్తుందని చైర్మన్ రాపూల్ జ్ఞానేశ్వర్ అన్నారు. బందు కార్యక్రమంలో సగర సంగం నాయకులు, యాదవ సంఘం నాయకులు, నూరు కాపు ముదిరాజ్,పద్మశాలి నాయకులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ హెచ్ సి యు విద్యార్థి నాయకులు , కిరణ్ కుమార్, మహిళా సంఘాల నాయకులు తదితరులు పాల్గొని ఈ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.. తదుపరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద బంధు పాటిస్తూ ఆల్ ఇండియా ఓబిసి స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో బందు కార్యక్రమాన్ని నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో రాపోలు జ్ఞానేశ్వర్, హైకోర్టు సీనియర్ న్యాయవాది శేషగిరిరావు, యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొని బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



