బంచరాయి భూములు, చెరువుల మేత హక్కులను కాపాడాలి

  • జి ఎం పి ఎస్ జిల్లా అధ్యక్షుడు మద్దెపురం రాజు 

విశ్వంభర, గుండాల : జిఎంపిఎస్  ఆధ్వర్యంలో గొర్రెల కాపర్లు పోరాడి సాధించుకున్న 1016, 559 జీవోలను ప్రభుత్వం పటిష్టంగా అమలు చేయాలని గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు మద్దెపురం రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుండాల మండలం మరిపడిగ గ్రామంలో గొర్రెల మేకల పెంపకందారుల సంఘం సమావేశం లింగంపల్లి మహేష్ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి హాజరైన మద్దెపురం రాజు మాట్లాడుతూ జిఎంపిఎస్ ఆధ్వర్యంలో గొర్రెల మేకల పెంపకదారులు అనేక సంవత్సరాలు పాలకవర్గ ప్రభుత్వాలపై పోరాడి 1016, 559 జీవోలను పోరాడి సాధించుకున్నారని వివరించారు.1996 జూలై 9న విడుదల చేసిన 559 జీవో ప్రకారం ప్రభుత్వ బంచరాయి,పోరంబోకు,శిఖం భూములు,గుట్టల వెంట గొర్రెలు,మేకలను మేపుకోవడానికి  అవకాశం ఉందన్నారు.ఈ జీవోలను రాష్ట్ర ప్రభుత్వం పటిష్టంగా అమలు చేయకపోవడం వల్ల మండలంలో ఉన్న ప్రభుత్వ బంచరాయి పోరంబోకు గుట్టలు బోళ్ళు గ్రామ పెత్తందార్లు ఆక్రమించి జీవాల మేతకు ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపించారు.1997 ఆగష్టు1న విడుదల అయిన 1016 జీవో ప్రకారం చెరువులు,కుంటలలో ఉన్న తుమ్మ మండ మేపుకొనుటకు జీవోలను పటిష్టంగా అమలు చేయుటకు మండల తహాశీల్దార్,గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతిని కోరారు.ఈ సమావేశంలో లింగంపల్లి పరుశరాములు,యండి.యాకుబ్,ఉడుత నర్సింహులు,బొంగు రమేష్,కొండెబోయిన రాజు,కొండెబోయిన వెంకటేష్,జెటంగి శ్రీను పాల్గొన్నారు.

🕒 26 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/bancharai-lands-should-protect-grazing-rights-of-ponds/article-15842

Tags: