వెల్లంకి ఫోటోగ్రాఫర్ కు పురస్కారం

వెల్లంకి ఫోటోగ్రాఫర్ కు పురస్కారం

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, వెల్లంకి గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ కాట్రేగు సంజీవకు ఉత్తమ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ పురస్కారం వరించింది. ఈ మేరకు హైదరాబాదులోని కేబీఆర్ కన్వెన్షన్ లో జరిగిన ఫోటో పరివార్ ఇండియా ఫోటోపిన వారి ఇండియన్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ ఈవెంట్లో జేఎన్టీయూ ప్రిన్సిపాల్ ఆనంద్,  ప్రొఫెసర్ కమల్ రాయ్, ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్ గౌడ్ ల చేతుల మీదుగా ఉత్తమ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ పురస్కారం అందుకున్నారు. ఈ అవార్డు వచ్చినందుకు కాట్రేగు సంజీవను పలువురు ఫోటోగ్రాఫర్లు, గ్రామస్తులు, శ్రేయోలాభిలాషులు అభినందించారు.

Tags: