ఆన్‌లైన్ గేమింగ్.. రూ.5వేల కోట్ల భారీ కుంభకోణం

ఆన్‌లైన్ గేమింగ్.. రూ.5వేల కోట్ల భారీ కుంభకోణం

ఆన్‌లైన్‌ గేమింగ్‌ ముసుగులో సాగుతున్న ఒక భారీ ‘సిండికేట్‌’ గుట్టును హైదరాబాద్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ అధికారులు రట్టు చేశారు.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: ఆన్‌లైన్‌ గేమింగ్‌ ముసుగులో సాగుతున్న ఒక భారీ ‘సిండికేట్‌’ గుట్టును హైదరాబాద్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ అధికారులు రట్టు చేశారు. ఏకంగా రూ.5,000 కోట్ల విలువైన ఈ అక్రమ సామ్రాజ్యంపై దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించారు. ఈ భారీ నెట్‌వర్క్‌ను నడిపిస్తున్న ప్రధాన సూత్రధారులుగా ముంబయికి చెందిన వైఎస్‌ ప్రభుకుమార్‌, హైదరాబాద్‌కు చెందిన రాజశేఖర్‌రెడ్డిని అధికారులు గుర్తించారు. వీరిద్దరూ కలిసి దేశవ్యాప్తంగా ఒక పకడ్బందీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి, గత కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా ఈ అక్రమ కార్యకలాపాలను సాగిస్తున్నట్లు విచారణలో తేలింది.

పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం.. ఒకేసారి మూడు ప్రధాన నగరాల్లో సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ నగరాల్లో నిర్వహించిన సోదాల్లో భారీ ఎత్తున జీఎస్టీ ఎగవేతకు సంబంధించిన పత్రాలు, అక్రమ లావాదేవీల రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వేల కోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతున్నా, పన్నులు చెల్లించకుండా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న తీరును చూసి అధికారులు సైతం విస్మయానికి గురయ్యారు. కేవలం గేమింగ్ మాత్రమే కాకుండా, ఈ లావాదేవీల వెనుక మనీ లాండరింగ్ కోణాలు కూడా ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉందని, త్వరలోనే మరిన్ని కీలక వివరాలు, అలాగే ఈ సిండికేట్‌లో భాగస్వాములుగా ఉన్న ఇతర వ్యక్తుల పేర్లు బయటపెడతామని అధికారులు వెల్లడించారు.

Read More ఏఆర్‌ రెహమాన్‌పై జాలి వద్దు.. ఆయన చాలా రిచ్‌..!

Advertisement

LatestNews