అసైన్డ్ భూములకు పూర్తి హక్కులు కల్పించాలి
విశ్వంభర, హిమత్‌నగర్ : అసైన్డ్ భూములపై పూర్తి యాజమాన్య హక్కులు లేకపోవడం పేదలు, భూమిలేని దళితులకు తీవ్ర అన్యాయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం. బాల నరసింహ అన్నారు. దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ సమావేశం సోమవారం హైదరాబాదు హిమత్‌నగర్‌లో కె. యేసు రత్నం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ దశాబ్దాలుగా సాగు చేస్తున్నప్పటికీ అమ్మకం, రుణాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో ఆంక్షలు ఉండటంతో దళితుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం లేదన్నారు. అసైన్డ్ భూములను రక్షించాల్సిన ప్రభుత్వాలు కార్పొరేట్, రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం పేదల భూములను లాక్కోవడానికి ప్రయత్నించడం ఆందోళనకరమన్నారు. భూమిపై పూర్తి హక్కులు లేకపోవడంతో దళితులు, బలహీన వర్గాలు అసురక్షిత పరిస్థితుల్లో జీవిస్తున్నాయని తెలిపారు. అసైన్డ్ భూములకు సంపూర్ణ యాజమాన్య హక్కులు కల్పిస్తూ చట్టపరమైన రక్షణలు ఇవ్వాలని, అలాగే “అంబేద్కర్ దళిత బంధు” పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా పారదర్శకంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి లక్ష్మణ్, ఆఫీస్ బేరర్స్ బోయిని అశోక్, ఆరుట్ల రాజ్ కుమార్, కే. రత్నకుమారి, దేవి పోచన్న, పొనగంటి లావణ్య తదితరులు పాల్గొన్నారు.