నారాయణఖేడ్ మున్సిపాలిటీని అభివృద్ధి చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వమే
- మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి
విశ్వంభరా, పెద్ద శంకరంపేట: నారాయణఖేడ్ పట్టణాన్ని మున్సిపాలిటీగా మార్చింది బిఆర్ఎస్ ప్రభుత్వమే, మున్సిపాలిటీని అభివృద్ధి చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వమే అని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు . మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఆధ్వర్యంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పట్టణాన్నీ మున్సిపాలిటీగా మార్చాను మార్చిన మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపించాను, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఎమ్మెల్యే అభివృద్ధి పనులు మానుకొని అభివృద్ధి చేయడం చేతకాక లేనిపోని మాటలు మాట్లాడుతూ కాలాన్ని గడిపిస్తున్నాడని ఆరోపించారు . నిన్న ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీలో ఎక్కడైనా గుంతలు పడితే ప్రజలు మట్టిని తెచ్చి వాటిని పూడ్చాలని తెలిపారు. అంటే దీనికి అర్థం పాలన గాడి తప్పిందని మాకు చేతకాదు అని ప్రజలే రోడ్లను వేసుకోవాలి అని తెలియజేస్తున్నారు. ప్రజల రోడ్డు వేసినప్పుడు మున్సిపాలిటీకి ప్రజలు టాక్స్ ఎందుకు కట్టాలో మీరు ట్యాక్స్ ఎందుకు తీసుకుంటున్నారు తెలియజేయవలసిన అవసరం ఎమ్మెల్యే కు ఉంది అని అన్నారు. మేము అన్ని నిధులు తెచ్చాము ఇన్ని నిధులు తెచ్చామని చెప్పడం మానేయ్ తెచ్చిన నిధులు ఎక్కడున్నాయో వాటి జీవోలతో పాటు మీరు ఎక్కడ వర్క్ చేశారో చూపించాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నజీబ్ పట్టణ పార్టీ అధ్యక్షులు నగేష్ సెట్ మాజీ సర్పంచ్ సంగప్ప తదితరులు ఉన్నారు.