ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత : జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

  • అదనపు కలెక్టర్ కె. అనిల్ కుమార్‌తో కలిసి అర్జీలు స్వీకరించిన కలెక్టర్ స్నేహ శబరిష్
  • మక్క జొన్న, ధాన్యం కొనుగోళ్ల నిర్వహణలో రైతుల నుండి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు

విశ్వంభర, మహబూబాబాద్:  సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన 'ప్రజావాణి' కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అదనపు కలెక్టర్ కె. అనిల్ కుమార్, జిల్లా స్థాయి అధికారులతో కలిసి ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎంతో ఆశతో ప్రజావాణికి వస్తారని, వారి అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో నమోదైన ప్రతి అర్జీని ఆయా శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి. ఎలాంటి జాప్యం లేకుండా నిబంధనల ప్రకారం పరిష్కరించాలి. కేవలం నివేదికల కోసమే కాకుండా, బాధితుడికి పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలి. ఒకవేళ సమస్య తిరస్కరణకు గురైతే, దానికి గల స్పష్టమైన కారణాలను అర్జీదారునికి లిఖితపూర్వకంగా తెలియజేయాలి అని అన్నారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, మరియు సంక్షేమ శాఖల అధికారులు పరస్పరం సమన్వయం చేసుకుంటూ భూ సమస్యలు, ఇతర సామాజిక సమస్యలను పరిష్కరించాలి. ఈరోజు జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ధరణి సమస్యలు, ఆసరా పింఛన్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, భూ వివాదాలు మరియు స్థానిక సమస్యలపై జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు కలెక్టర్‌కు వినతి పత్రాలు సమర్పించారు. ఈ అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు బదిలీ చేస్తూ, వీలైనంత త్వరగా నివేదికలు సమర్పించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ స్పష్టం చేశారు. మహబూబాబాద్ మండలం చొక్లాతండా కు చెందిన భూక్య సుందర్ నాయక్ చోక్లాతండ గ్రామపంచాయితీ మేఘ్యాతండ లో నీటి కొరత ఉండటం వలన ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారని ప్రజలు వేరే చోటు నుండి నీరు తెచ్చుకోవడం ఇబ్బందులకు గురి అవుతున్నారని చొక్లా తండ గ్రామ పంచాయతీలో మరియు మేగ్యాతండ లో రెండు బోర్లు వేయించి ప్రజలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. బయ్యారం మండలం మిర్యాలపెంట గ్రామపంచాయతీ లోని పి.హెచ్.సి లో ఎం.బి.బి.ఎస్ డాక్టర్ ని నియామించాలని జిల్లా కేంద్రానికి మా గ్రామం దూరంగా ఉందని గ్రామ ప్రజలు వైద్యం విషయంలో చాల ఇబ్బందులు పడుతున్నారని మా గ్రామ పి.హెచ్.సి లో ఎం.బి.బి.ఎస్ డాక్టర్ ని నియామించి వైద్య సేవలు అందించాలని అన్నారు. ఆదివాసీ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మెన్ వర్స ప్రకాష్ బయ్యారం మండలం లోని కొత్తపేట గ్రామపంచాయతీలో కొత్తపేట మరియు గంధంపల్లి రెవెన్యు గ్రామములో గల ప్రభుత్వ భూములను ఏజెన్సీ యాక్ట్ ప్రకారం గిరిజనేతరులు ప్రభుత్వ భూములు ఏవిధంగా అనుభవిస్తున్నారో వారికి అట్టి హక్కు ఏవిధంగా సంక్రమిచినదో తెలుపాలని, కొత్తపేట మరియు గంధంపల్లి రెవెన్యు గ్రామములలో గల ప్రభుత్వ భూములను సర్వే చేపించి ఈ యొక్క భూములను ప్రభుత్వ పరిధిలోని తీసుకోవలసిందిగా కోరారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 132 దరఖాస్తులు వచ్చాయి. ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో సమావేశమైన కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మక్క జొన్న, ధాన్యం కొనుగోళ్ల నిర్వహణలో రైతులను డబ్బులు వసూలు చేస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు,
గత రెండు మూడు రోజుల నుండి రికార్డు స్థాయిలలో కొనుగోలు తరలింపు జరుగుతుందని మరింత అంకితభావంతో పనిచేసే రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఈరోజు నుండి ప్రారంభమైన యువజన క్రీడా దినోత్సవ పోస్టర్ను ఆవిష్కరించి జిల్లా వ్యాప్తంగా షెడ్యూల్ ప్రకారం ఏర్పాటుచేసిన కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కె.అనిల్ కుమార్, జడ్పీ సీఈవో (హౌసింగ్ పీడీ) పురుషోత్తం, డి ఆర్ డి ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, డిసిఓ వెంకటేశ్వర్లు, అన్ని విభాగాల అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్, డివిజన్ కార్యాలయాలలో డివిజన్ స్థాయి అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.

🕒 19 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/district-collector-sneha-sabarish-is-the-first-priority-for-solving/article-15430

Tags: