జర్వేషన్ల పరిరక్షణకు బహుజన వర్గాలు ఐక్యంగా పోరాడాలి: చిక్కుడు ప్రభాకర్

విశ్వంభర, బాగ్ లింగంపల్లి: రాజ్యాంగబద్ధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కల్పించిన రిజర్వేషన్లను కాపాడుకోవాలంటే బహుజన వర్గాలన్నీ ఐక్యంగా ఉద్యమించాలఅని సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఛత్రపతి సాహూజీ మహారాజ్ జయంతి సందర్భంగా హైదరాబాదు బాగ్‌లింగంపల్లి  సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొందరు ఎందుకు వ్యవహరిస్తున్నారో ప్రజలు ఆలోచించాలని ప్రభాకర్ సూచించారు. రాజ్యాంగం కల్పించిన విద్య, ఉద్యోగాలు, ఉపాధి, స్థానిక సంస్థలు, చట్టసభల రిజర్వేషన్లను పరిరక్షించేందుకు దళిత, బీసీ, బడుగు, బలహీన వర్గాలు ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దళిత, బడుగు, బలహీన వర్గాల జీవన ప్రమాణాలు దిగజారాయని, అసంఘటిత కార్మిక రంగంలో అధిక శాతం ఈ వర్గాల వారే ఉన్నారని తెలిపారు. తెలంగాణలో పేదరిక రేఖకు దిగువన లక్షలాది కుటుంబాలు జీవిస్తున్నాయని, ప్రభుత్వ గణాంకాలే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. రిజర్వేషన్ల పేరుతో బడుగు వర్గాలను మోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన ఆయన, విద్య, ఉద్యోగాలు, ఉపాధి, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను కాపాడుకోవాలంటే సమష్టి ఉద్యమమే మార్గమన్నారు. నీట్ పరీక్ష నిర్వహణలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ, విద్యార్థుల ఉద్యమాలకు ప్రజలు మద్దతు తెలపాలని కోరారు. సామాజిక న్యాయం, సమాన హక్కులు సాధించే వరకు ప్రజాస్వామ్యబద్ధమైన పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా బహుజన సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కదిరి కృష్ణ మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిరావు పూలే, ఛత్రపతి సాహూజీ మహారాజ్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆలోచనలే బీసీ కులాల విముక్తికి మార్గమని అన్నారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను వివిధ మార్గాల్లో నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, సామాజిక న్యాయ స్ఫూర్తికి విరుద్ధంగా ఆర్థికంగా బలహీన వర్గాల రిజర్వేషన్ల పేరుతో బహుజన వర్గాలకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. దళిత క్రైస్తవుల రిజర్వేషన్ల అంశంపై లోతైన చర్చ అవసరమని, రాజ్యాంగ విలువలను పరిరక్షించేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో: తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఎనుముల జగన్ బహుజన ఫిలాసఫర్ కుమార్ నాగేల్లి జి చంద్రశేఖర్ బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మహేందర్ యాదయ్య ఇమాన్యుయల్ మహిళా నాయకురాలు తులసి రాష్ట్ర నాయకులు సాగర్ కర్నాటి నవీన్ అల్లం దేవ సంజీవ్ శంకర్ లాల్ రాజేష్ రక్షక్ తదితరులు పాల్గొన్నారు.

🕒 27 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/bahuja-groups-should-fight-unitedly-for-the-preservation-of-reservations/article-19878

Tags: