9 నుంచి అఖిల భారత జైల్ డ్యూటీ మీట్ - 2025
తెలంగాణ రాష్ట్ర జైళ్లు, సవరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా ఐపిఎస్
On
విశ్వంభర, హైదరాబాద్, సెప్టెంబర్ 07: తెలంగాణ జైలు మరియు సవరణాశాఖ ఆధ్వర్యంలో 7వ అఖిల భారత జైలు డ్యూటీ మీట్ – 2025 ఈ నెల సెప్టెంబర్ 9 నుండి 11 వరకు హైదరాబాదులోని ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో జరగనుంది. దేశంలోని 21 రాష్ట్రాలు మరియు 3 కేంద్రపాలిత ప్రాంతాల నుండి వచ్చిన 1,300 మందికి పైగా జైలు సిబ్బంది (ఇందులో 184 మంది మహిళలు) పాల్గొని 36 విభాగాల్లో తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. వీటిలో ప్రథమ చికిత్స, వెల్ఫేర్ పథకాలు, క్విజ్, కంప్యూటర్ నైపుణ్యం వంటి వృత్తి సంబంధిత పోటీలు, అలాగే అథ్లెటిక్స్, వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్‌బాల్, కరాటే, క్రావ్ మాగా, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం వంటి క్రీడలు, సాంస్కృతిక పోటీలు ఉంటాయి. ఈ ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రం రెండవసారి ఆతిథ్యం ఇస్తోంది. 2015లో తొలిసారి నిర్వహించగా, 2022లో అహ్మదాబాద్‌లో జరిగిన 6వ జైలు డ్యూటీ మీట్‌లో తెలంగాణ రాష్ట్రం ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించింది. ఈసారి తొలిసారిగా ఆల్ ఇండియా టెక్నో ఎక్స్‌పో మరియు జైలు ఉత్పత్తుల ప్రదర్శన స్టాళ్లు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. సన్నాహక కార్యక్రమంలో భాగంగా, తెలంగాణ జైలు సవరణాశాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా, ఐపీఎస్ తెలంగాణ కాంటిజెంట్ జట్టు సభ్యులైన 84 మందికి క్రీడా కిట్లను పంపిణీ చేసి, జాతీయ స్థాయిలో క్రమశిక్షణతో ఆత్మవిశ్వాసంగా రాణించాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి శాఖ, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్, న్యూఢిల్లీ మరియు కేంద్ర హోంమంత్రిత్వశాఖతో సమన్వయం చేసుకుంటూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 9వ తేదీన మంగళవారం ఉదయం 9:30 గంటలకు హిమాయత్ సాగర్ లోని పోలీస్ అకాడమిలో రాష్ట్ర గవర్నర్ జిస్టుదేవ్ వర్మ ముఖ్యఅతిధిగా పాల్గొని జైలు డ్యూటీ మీట్ ను ప్రారంభిస్తారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కె.రామక్రిష్ణారావు ఐఏఎస్, రాష్ట్ర హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రవి గుప్తా ఐపిఎస్, రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ ఐపిఎస్, తదితరులు పాల్గొంటారని తెలిపారు.
🕒 07 Sep 2025 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/all-india-jail-duty-meet-from-9-2025/article-6425