అల్ ఫలాహ్ యూనివర్సిటీ: దిల్లీ పేలుళ్ల తర్వాత వెలుగులోకి వచ్చిన సంస్థ ..?

అల్ ఫలాహ్ యూనివర్సిటీ: దిల్లీ పేలుళ్ల తర్వాత వెలుగులోకి వచ్చిన సంస్థ ..?

విశ్వంభర, డెస్క్ ;- దేశ రాజధాని దిల్లీ నుంచి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధౌజ్ గ్రామ సరిహద్దు మొదలవగానే పోలీసు బారికేడ్లు కనిపిస్తాయి.ఇక్కడి నుంచి వచ్చి పోయే ప్రతి వాహనాన్ని పదుల సంఖ్యలో సైనికులు తనిఖీ చేస్తున్నారు.

ఎవరిపైనైనా అనుమానం వస్తే డ్రైవర్ ఫోన్ నంబర్‌తో సహా మరిన్ని వివరాలను కూడా నమోదు చేసుకుంటున్నారు.

Read More మానవత్వం చాటుకున్న గుంటక రూప సదా శివ్

ఇక్కడి నుంచి దాదాపు రెండున్నర కిలోమీటర్ల దూరంలో, ప్రధాన రహదారి నుంచి ఒక కిలోమీటరు దూరంలో, అల్ ఫలాహ్ యూనివర్సిటీ క్యాంపస్ ఉంది. 70 ఎకరాలకు పైగా విస్తరించిన దీని చుట్టూ ప్రహరీ గోడ ఉంది.

యూనివర్సిటీ గేటు బయట మోహరించిన భద్రతా సిబ్బంది జర్నలిస్టులను లోపలికి రాకుండా అడ్డుకుంటున్నారు.

ఇక్కడ చాలామంది జర్నలిస్టులు ఉన్నారు. వారు యూనివర్సిటీ క్యాంపస్ నుంచి బయటకు వెళ్ళే వ్యక్తులతో మాట్లాడేందుకు మైక్ ముందుకు పెడుతున్నారు. కానీ చాలా మంది స్పందించకుండా వెళ్లిపోతున్నారు.

కొంతమంది జర్నలిస్టులు వారేమైనా మాట్లాడతారేమో అని వారి వెనకాలే వెళుతున్నారు. ఇంత గందరగోళం మధ్య, ఆ వ్యక్తులందరూ మౌనంగా ఉన్నప్పటికీ, వారి ముఖాల్లో సంకోచం, భయం స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఈ యూనివర్సిటీని 2014లో స్థాపించారు. ఈ ఏడాది అక్టోబర్ చివరలో హరియాణా పోలీసులతో కలిసి జమ్మూకశ్మీర్ పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో అక్కడ ఒక ప్రొఫెసర్‌ను అరెస్ట్ చేయడంతో దీనిపేరు వెలుగులోకి వచ్చింది.

 

 

 

Tags: