శ్రవణ్ కుటుంబానికి ఆర్థిక సాయం

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్ల, రామన్నపేట మండలం, వెల్లంకి గ్రామంలో కొన్ని రోజుల క్రితం రవ్వ శ్రవణ్ అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుటుంబానికి అండగా నిలుస్తూ పలువురు ఆర్థిక సాయం చేశారు. అందులో భాగంగా శ్రవణ్ ఫ్రెండ్స్ ఎస్.ఎస్.సి 2007-08 బ్యాచ్ వారు రూ.44,900, భార్య అనిత ఎస్.ఎస్.సి 2012-13 బ్యాచ్ వారు రూ.26,000, జనసేన పార్టీ రూ.11,800, గ్రామానికి చెందిన తూడి మురళీ రూ.10,000, మార్కండేయ కాలనీ వారు రూ.10,000 అందజేశారు. అంతా కలిపి రూ.లక్షను అనిత, పిల్లల పేరు మీద బ్యాంకులో ఫిక్సుడ్ డిపాజిట్ చేశారు.

🕒 03 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/financial-help-to-shravan-family/article-17722

Tags: