సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ వినూత్న క్యాంపెయిన్‌కు శ్రీకారం

సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ వినూత్న క్యాంపెయిన్‌కు శ్రీకారం

స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) వేదికగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) వినూత్న క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టింది.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) వేదికగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) వినూత్న క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టింది. ‘స్క్రీన్ టైమ్ టు యాక్టివిటీ టైమ్’ అనే వినూత్న క్యాంపెయిన్‌ను ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వీరేంద్ర సింగ్ సోలంకి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన 'రన్ ఫర్ నేషన్' 5కే రన్‌లో వేలాది మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ప్రస్తుత సమాజంలో సాంకేతికత పేరిట యువత డిజిటల్ బానిసలుగా మారుతున్నారని డాక్టర్ వీరేంద్ర సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. సగటున ఒక విద్యార్థి రోజుకు 8-9 గంటలు స్క్రీన్‌లకే అతుక్కుపోతున్నారని, దీనివల్ల శారీరక దృఢత్వం తగ్గడమే కాకుండా చిన్న వయసులోనే మానసిక ఒత్తిడి బారిన పడుతున్నారని హెచ్చరించారు. మొబైల్ ఫోన్ల అతి వినియోగం వల్ల మనుషుల మధ్య ప్రత్యక్ష సంబంధాలు తగ్గిపోతున్నాయని, దీనిని అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

Read More విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవాలి.  - ఈ ఎల్ వి భాస్కర్

యువతను ఆకట్టుకునేలా ఏబీవీపీ ఈ క్యాంపెయిన్ కోసం పలు నినాదాలను సిద్ధం చేసింది. 'స్క్రీన్ టైమ్ టు గ్రీన్ టైమ్', 'స్క్రీన్ టైమ్ టు ఫన్ టైమ్', 'స్క్రీన్ టైమ్ టు ప్లే టైమ్', 'మీల్ వితౌట్ రీల్' వంటి పిలుపులతో యువతను ఆరోగ్యకరమైన, సామాజికంగా అనుసంధానమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ప్రోత్సహించబోతున్నట్లు తెలిపారు.