ఏటీఓలకు అర్హతకు తగ్గ వేతనాలు ఇవ్వాలి: ప్రొ. కాశిం
విశ్వంభర, హైదరాబాదు : ఉద్యోగులు ఐక్యంగా ఉంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచితేనే సమస్యలు పరిష్కారమవుతాయని, ఏటీసీల్లో పనిచేస్తున్న ఏటీఓలకు అర్హత, అనుభవానికి తగ్గ వేతనాలు చెల్లించాలి అని ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ. కాశిం అన్నారు. హైదరాబాదులోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల (ఏటీసీ)లో పనిచేస్తున్న సహాయ శిక్షణ అధికారుల (ఏటీఓ) సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. బీటెక్, ఎంటెక్ అర్హతలు ఉన్న ఉద్యోగులకు నామమాత్రపు వేతనాలు చెల్లించడం, రెండు నెలలుగా జీతాలు నిలిపివేయడం సరికాదన్నారు. పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేసి, ఏజెన్సీల ద్వారా కాకుండా ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా టీఈజేఏఎన్టీయూ పేరుతో సంఘాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో షేక్ ముస్తాఫా, శరత్‌కుమార్, మహేష్, వీరస్వామి, గోపి, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.