గ్రూప్‌-1 వ్యవహారంలో ఏపీ సీఎస్‌పై హైకోర్టు ఆగ్రహం

గ్రూప్‌-1 వ్యవహారంలో ఏపీ సీఎస్‌పై హైకోర్టు ఆగ్రహం

విశ్వంభర,  అమరావతి: ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 వ్యవహారంలో సీఎస్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయనందుకు మండిపడింది. గ్రూప్‌ 1 పరీక్షల వాల్యుయేషన్‌కు సంబంధించిన కేసుపై మంగళవారం విచారణ చేపట్టిన సందర్భంగా సీఎస్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.గత విచారణలో గ్రూప్‌ 1 పరీక్షలకు సంబంధించిన అవకతవకలపై ప్రత్యేక సిట్‌ ఏర్పాటు చేసి విచారణ కొనసాగించాలని, ఎవరైతే ఆ నోటిఫికేషన్‌లో అర్హత సాధించి ఉద్యోగాల్లో చేరి విధులు నిర్వహిస్తున్నారో వారందరినీ ప్రాధాన్యత లేని పోస్టులకు పంపాలని సీఎస్‌ని ఆదేశించింది. ఇప్పటివరకు సీఎస్‌ ఆ ఆదేశాలు పాటించకపోవడంపై ప్రశ్నించింది. ఈ అంశంపై సుమోటోగా ధిక్కరణ కేసు ఎందుకు నమోదు చేయకూడదో చెప్పాలని అడిగింది. బుధవారం ఉదయం 10.30గంటలకు కోర్టుకు హాజరు కావాలని సీఎస్‌ ఆదేశించింది.

Tags: