రైతు బజార్ ను పరిశిలించిన ట్రైనీ కలెక్టర్
విశ్వంభర, వికారాబాద్ : రైతు బజార్ వెనక భాగాన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు నడుస్తున్న కారణంగా కూరగాయలు అమ్ముకునే రైతులకు రైతు బజార్ లోపల స్థలం లేకపోవడంతో రోడ్డు మీదకు వచ్చి కూరగాయలు అమ్ముకుంటున్నారు. దీనివల్ల కూరగాయలు అమ్మే వారికి, కొనుగోలు చేసే వారికి, అటుగా వెళ్లే వాహనదారులకు అనేక ఇబ్బందులు అవుతున్నాయని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో స్పీకర్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ని ఆదేశించడంతో మంగళవారం ట్రైని కలెక్టర్ ఉమా హారతి, స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ తో కలిసి వికారాబాద్ పట్టణంలోని రైతు బజార్ ను సందర్శించి అక్కడ ఉన్న సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ట్రైనీ కలెక్టర్ ఉమా హారతి , చైర్ పర్సన్ పాత కూరగాయల మార్కెట్ ను కూడా సందర్శించారు. కూరగాయల మార్కెట్ మొత్తం బురద మయంగా మారిందని, ఈ సమస్యను కూడా వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని చైర్ పర్సన్ ట్రైనీ కలెక్టర్ ని కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ జాకీర్ అహ్మద్, కౌన్సిలర్ శ్రీదేవి సదానంద్ రెడ్డి, నాయకులు సదానంద్ రెడ్డి, శానిటేషన్ ఇన్చార్జ్ ఎస్ఐ ఏసు, ఇంజనీర్ శ్రీనివాస్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.