అర్హులైన ఏ ఒక్కరి ఓటు కూడా పోకూడదు

అర్హులైన ఏ ఒక్కరి ఓటు కూడా పోకూడదు

విశ్వంభర, గోల్నాక : అర్హులైన ఏ ఒక్కరి ఓటు కూడా తొలగిపోకూడదు, ప్రతి కుటుంబం బీఎల్‌వో అధికారులకు పూర్తి సహకారం అందించి, తమ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని అంబర్‌పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. హైదరాబాదు గోల్నాక తులసీరామ్‌నగర్ బస్తీలో రూ.28 లక్షల వ్యయంతో చేపట్టనున్న పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. గోల్నాక లంక బస్సు స్టాప్ నుంచి డీమార్ట్ సమీపంలోని బస్తీ దవాఖాన వరకు 550 మీటర్ల మేర నాలాలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించే పనులను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన పాదయాత్రలో స్థానికులతో మాట్లాడిన ఎమ్మెల్యే, ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బీఎల్‌వో అధికారులకు అవసరమైన వివరాలు అందించి, ఓటరు జాబితాలో పేర్లు సక్రమంగా నమోదయ్యేలా ప్రజలు చొరవ చూపాలని సూచించారు. అలాగే వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నాలా పూడికతీత పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో: బస్తీ అధ్యక్షుడు రాచకట్ల దేవేందర్ గండికోట జనార్ధన్, బాబన్న, అంజయ్య చారి, ప్రభాకర్,  రాజేష్ ఈశ్వర్, పవన్, సంతోష్ , నర్సింగ్, శివ , బాలరాజు, శంకర్, జగన్, సురేష్ గౌడ్ అధికారులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

🕒 14 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/no-eligible-vote-should-be-lost/article-18589

Tags: