రైతులకు సకాలంలో సాగునీరు అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే బి.ఎల్.ఆర్
విశ్వంభర, మిర్యాలగూడ: మిర్యాలగూడ నియోజకవర్గ రైతులకు సాగునీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. సోమవారం మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి నియోజకవర్గంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇరిగేషన్ పనుల పురోగతి, వివిధ ప్రాజెక్టుల స్థితిగతులు, పెండింగ్‌లో ఉన్న పనులు, అలాగేరైతుల అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన నూతన సాగునీటి ప్రాజెక్టులపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. అలాగేమిర్యాలగూడనియోజకవర్గం పరిధిలోని అన్ని చెరువులు పూర్తి స్థాయిలో పెంచాలి అని అదేశించారు.. తద్వారా భవిషత్తులో రైతులకి బావులలో , బోర్లలో నీటి శాతం తగ్గకుండా ఉంటుంది అని సూచించారు. ఈ సందర్భంగా ప్రతి పనిని నిర్దేశిత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలనిఅధికారులను ఆదేశించారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకునిభవిష్యత్తులోచేపట్టాల్సిన కొత్త ఇరిగేషన్ ప్రతిపాదనలపై కూడా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సూచించారు. అనంతరం ఇరిగేషన్ అధికారులతో కలిసి మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలో11కోట్లతోనిర్వహిస్తున్న ఎన్ ఎస్పిలెఫ్ట్కెనాల్మరమ్మత్తుపనులనుఎమ్మెల్యే క్షేత్రస్థాయిలోపరిశీలించారు. పనుల పురోగతిని స్వయంగా తనిఖీ చేసి, ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులకు స్పష్టం చేశారు. సాగుసీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కాలువ మరమ్మత్తులు త్వరితగతిన పూర్తిచేసి, రైతులకు సకాలంలో సాగునీరు అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వంఅత్యంతప్రాధాన్యత ఇస్తోందని,వ్యవసాయాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి రాజీ ఉండదని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి రైతుకు సాగునీటి సౌకర్యం మెరుగుపడేలా నిరంతరం అధికారులతో సమన్వయంచేస్తూఅభివృద్ధికార్యక్రమాలను వేగవంతం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు ఎస్.సి మల్లికార్జున రావు , ఈ ఈ గోపినాథ్ , ఈ ఈమనోహర్ , డి ఈ లు , ఏ ఈ తదితరులు పాల్గొన్నారు.