ప్రమాదకరంగా విద్యుత్ స్తంభం

ప్రమాదకరంగా విద్యుత్ స్తంభం

విశ్వంభర, హైదరాబాదు : 60 రోజులుగా ప్రమాదకరంగా వంగి ఉన్న విద్యుత్ స్తంభాన్ని వెంటనే తొలగించాలని బర్కత్పురా విక్రం నగర్ వాసులు , వాకర్స్ డిమాండ్ చేశారు. హైదరాబాదు బర్కత్పురా విక్రం నగర్ పార్కు నుంచి రెడ్డి కళాశాలకు వెళ్లే ప్రధాన మార్గంలో రెండు నెలల క్రితం ఈదురుగాలులు,  వర్షాల కారణంగా ఓ భారీ వృక్షం నేలకొరగడంతో విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా వంగిపోయింది. అప్పటి నుంచి దాదాపు 60 రోజులు గడిచినా సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మార్గంలో ప్రతిరోజూ విద్యార్థులు, స్థానికులు, వాకర్స్ అధిక సంఖ్యలో రాకపోకలు సాగిస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న భయం నెలకొంది. ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉన్నందున సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ప్రమాదకరంగా వంగి ఉన్న విద్యుత్ స్తంభాన్ని తొలగించి, కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

🕒 14 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/draft-add-your-title/article-18581

Tags: