హుజూర్ నగర్ లో గాయపడిన చిన్నారులు కోలుకున్నారు 

  • :  డాక్టర్ శ్రావణ్ కుమార్ 

విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు చిన్నారుల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రావణ్ కుమార్ తెలిపారు. ఈరోజు చిన్నారుల ఆరోగ్యం పరిస్థితిపై ఆరాతీసి మాట్లాడారు. గత నెల 9న హుజూర్ నగర్ లో తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఈ చిన్నారులకు పీడియాట్రిక్ వార్డులో వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన చికిత్స అందించినట్లు ఆయన వివరించారు. ఎముకల ఫ్రాక్చర్, తీవ్ర గాయాల నుంచి వారు కోలుకుంటున్నారని, ప్రస్తుతం వారి ఆరోగ్య స్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. చిన్నారుల పట్ల తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, తల్లిదండ్రులకు సైకయాట్రిక్ కౌన్సెలింగ్ అవసరమని సూచించారు. వైద్య పరీక్షల అనంతరం చిన్నారులను చైల్డ్ కేర్ విభాగానికి తరలిస్తామని ఆయన వెల్లడించారు. ఈ చికిత్సలో భాగస్వాములైన ఆసుపత్రి వైద్యులకు, సిబ్బందికి, ఆయమ్మలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

🕒 14 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-injured-children-have-recovered-in-huzur-nagar/article-18595

Tags:  

Advertisement

LatestNews

శ్రీ చైతన్యలో పుస్తకాల దందా.. 1వ తరగతి చిన్నారికి మెటా యాప్ పేరుతో వేల రూపాయల దోపిడీ..
ఇయర్‌ఫోన్స్‌లో ఏకంగా 8 మైక్రోఫోన్లా? ఫీచర్లు చూస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే
అనంతపురం మున్సిపల్ ఆఫీసులో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై ఆరోపణలు
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఓ ఆనంద్ ఆకస్మిక తనిఖీ
పటాన్‌చెరులో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన.. శక్తి స్కీంలో విలీనం చేయొద్దంటూ ఆందోళన
భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకంపై కవిత
దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి