ఇందిరమ్మ ఇండ్లు త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్
విశ్వంభర , మహబూబాబాద్: సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుండి జిల్లాలోని అన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ డీఈలు, పంచాయతీ ఏఈ లు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిలో జిల్లాలో మొదటి స్థానంలో ఉండేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఇప్పటికే అర్హులైన లబ్ధిదారులకు మంజూరు చేసిన ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచే విధంగా క్షేత్రస్థాయిలో పంచాయితీ కార్యదర్శులు లబ్ధిదారులను చైతన్య పరచాలని సూచించారు, మొదటి పేస్ నుండి ఇప్పటివరకు జారీ చేసిన వివరాల ప్రకారం పనులు పూర్తి చేయాలని, పూర్తిచేసిన పనులకు బిల్లులను త్వరగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 90 రోజుల పనుల కార్యక్రమంలో చేపట్టే అన్ని అంశాలను ప్రాధాన్యతకు తీసుకొని గ్రామస్థాయిలో పనులు నిర్వహించాలని సూచించారు, జిల్లాలోని రెండు పడకల గదుల నిర్మాణంలో పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని అతి త్వరలో లబ్ధిదారులకు అందించడం కోసం అంతర్గత పనులు ఉంటే పూర్తి చేయాలని సూచించారు, ఐ హెచ్ హెచ్ ఎల్ పై సమీక్షించారు. ఈ సమీక్ష సమావేశంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు హౌసింగ్ పిడి పురుషోత్తం, డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్ వినోద్ కుమార్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని మండలాల నుండి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.