అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ వద్దిరాజు
విశ్వంభర, కేసముద్రం: రాజ్యసభలో బీఆర్ఎస్ పక్ష నేత, పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర సోమవారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాట్రపల్లిలో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యాన నెలకొల్పిన ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, వేం నరేందర్ రెడ్డి, లోకసభ సభ్యులు పోరిక బలరాం నాయక్, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ మురళీనాయక్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గంటా సంజీవరెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముందు ఎంపీ రవిచంద్ర తన పెద్దన్న వద్దిరాజు కిషన్, తమ్ముడు వద్దిరాజు వెంకటేశ్వర్లు తదితరులతో కలిసి గ్రామంలోని కాకతీయుల కాలం నాటి పురాతన శివాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు, స్థానికులు ఎంపీ రవిచంద్రకు సాదర స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు.