చేనేత సహకార సంఘాలను కాపాడుకోవాలి

చేనేత సహకార సంఘాలను కాపాడుకోవాలి

విశ్వంభర, రామన్నపేట: చేనేత సహకార సంఘాలు ఉంటేనే కార్మికులకు మేలు జరుగుతుందని, సహకార సంఘాలను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి చేనేత వృత్తిదారులపై ఉందని శ్రీమార్కండేయ సిల్క్ చేనేత సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం జనంపల్లి అధ్యక్షులు సంగిశెట్టి సుదర్శన్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, జనంపల్లి గ్రామంలోని చేనేత సహకార సంఘం పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులుగా సంగిశెట్టి సుదర్శన్, ఉపాధ్యక్షులుగా సంగిశెట్టి విజయలక్ష్మి, కార్యదర్శిగా వనం శంకర్, కోశాధికారిగా పున్న శ్రీధర్, డైరెక్టర్లుగా కర్ణాటక రమేష్, కైరంకొండ బిక్షం, సంగిశెట్టి గణేష్, సంగిశెట్టి కళమ్మ, సూరపల్లి మహాలక్ష్మి లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బండ సరోజ అంజిరెడ్డి, చేనేత వృత్తిదారులు, కార్మికులు నూతన కార్యవర్గాన్ని సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.

🕒 14 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/handloom-cooperative-societies-should-be-protected/article-18632

Tags: