సర్వే నెం.1189 భూమిపై సమగ్ర విచారణ జరపాలి

  • ప్రజావాణిలో హుస్నాబాద్ బిఆర్ఎస్ నాయకుల ఫిర్యాదు

విశ్వంభర, హుస్నాబాద్ : హుస్నాబాద్ పట్టణంలోని అమరవీరుల స్థూపం సమీపంలోని సర్వే నెం.1189 భూమిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని, ఆ భూమిలో జరిగిన అక్రమ లేఅవుట్లు, మున్సిపల్ అనుమతి లేకుండా చేపడుతున్న భవన నిర్మాణాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో  ప్రజావాణి అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ సర్వే నెం.1189 భూమికి సంబంధించిన అంశంపై పట్టణంలో అనేక అనుమానాలు, చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. భూమిలో కొంత భాగం సీలింగ్ భూమిగా, మరికొంత భాగం కుల పెద్దలకు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఆ భూమిలో ఎలాంటి సాగు లేదా నిర్మాణాలు లేకపోయినా, ప్రస్తుతం భూముల ధరలు పెరగడంతో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ భూములను సైతం ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ అనుమతులు లేకుండానే వెంచర్లు ఏర్పాటు చేసి ప్లాట్లు విక్రయించడం వల్ల అమాయక ప్రజలు మోసపోయి ఆర్థికంగా నష్టపోతున్నారని అన్నారు. పట్టణంలో అక్రమ లేఅవుట్లు, అనుమతులు లేని భవన నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ అంశంపై దృష్టి సారించి సర్వే నెం.1189 భూమిపై సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు అయిలేని మల్లికార్జున్ రెడ్డి, సీనియర్ నాయకులు బొజ్జ హరీష్, యాస శ్రీనివాస్, మేకల వికాస్ యాదవ్, భూక్యా రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

🕒 30 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/survey-no-1189-land-should-be-thoroughly-investigated/article-17381

Tags: