నేడు జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం
విశ్వంభర, సూర్యాపేట: జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని సోమవారం సూర్యాపేట జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయం ఆధ్వర్యంలో బాలేంలలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి (డీఎంహెచ్‌ఓ) డా. బి. నంద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఒక సంవత్సరం నుంచి 19 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారి, విద్యార్థి తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలను తీసుకోవాలని సూచించారు. ఈ మాత్రల వల్ల కడుపులోని నులిపురుగులు నిర్మూలన చెంది, పోషకాహార లోపం కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని తెలిపారు. అలాగే పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. జిల్లాలో ఒకటి నుంచి 19 సంవత్సరాల వయస్సు గల మొత్తం 2,03,215 మంది లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు. వీరికి అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల ద్వారా ఉపాధ్యాయుల సహకారంతో ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసినట్లు చెప్పారు. బడికి వెళ్లని చిన్నారులకు ఆశా కార్యకర్తల ద్వారా మాత్రలు అందజేస్తున్నట్లు వివరించారు. నేడు మాత్రలు అందుకోలేని వారికి జూలై 20, 2026న మాప్-అప్ కార్యక్రమం నిర్వహించి మాత్రలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని జిల్లాలో 100 శాతం విజయవంతం చేయడానికి ప్రజలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహకరించాలని డీఎంహెచ్‌ఓ కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డా. నిల, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా. జి. చంద్రశేఖర్, పీఓ-సీహెచ్‌ఐ డా. కోటి రత్నం, డా. జి. ప్రసిద్ధ్, డా. నాజియా తబస్సుమ్, డా. స్రవంతి, బాసిద్, మత్స్యగిరి, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.