పిల్లలకు ఉచిత ఆల్బెండాజోల్ మాత్రల పంపిణీ 

విశ్వంభర, గుండాల: భారత ప్రభుత్వ ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం  సందర్భంగా సోమవారం గుండాల మండలంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలు, కిశోరులకు ఉచితంగా ఆల్బెండాజోల్ మాత్రలను పంపిణీ చేసినట్లు వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏదైనా కారణాల వల్ల మాత్రలు తీసుకోలేకపోయిన పిల్లలకు జూలై 20న నిర్వహించే “మాప్-అప్ రౌండ్”లో ఆల్బెండాజోల్ మాత్రలు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, పిల్లలను పేగు నులిపురుగుల బారినుంచి రక్షించడం, వారి ఆరోగ్యం, పోషకాహార స్థితి, శారీరక ఎదుగుదల, విద్యా సామర్థ్యాన్ని మెరుగుపరచడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని చెప్పారు. నులిపురుగుల సంక్రమణ వల్ల రక్తహీనత, పోషకాహార లోపం, కడుపు నొప్పి, బలహీనత, ఎదుగుదల మందగించడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. అందువల్ల ప్రతి అర్హత కలిగిన బాలబాలికలు తప్పనిసరిగా ఆల్బెండాజోల్ మాత్రలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు దేవనబోయిన ఐలయ్య, అల్లంశెట్టి మహేష్, కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లు, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ డాక్టర్ ప్రవీణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

🕒 14 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/distribution-of-free-albendazole-tablets-to-children/article-18585

Tags: