తక్షణమే పిఆర్ సి అమలు చేయాలి
- సి పి ఎస్ ను రద్దు చేసి యథాతతంగా ఓ పీ ఎస్ అమలు చేయాలి
- టి పి టి ఎఫ్ జిల్లా కార్యదర్శి రాచకొండ ఉపేందర్
విశ్వంభర, మహబూబాబాద్ : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పెండింగ్ లో ఉన్న ఆరు డిఏల మంజూరు, కమిటీ నివేదిక తెప్పించుకొని తక్షణమే పి ఆర్ సి అమలుచేసి కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని టి పి టి ఎఫ్ జిల్లా కార్యదర్శి రాచకొండ ఉపేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ మహబూబాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో మండలంలోని ప్రభుత్వ పాఠశాలల సందర్శన, సమస్యల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గర్ల్స్ ప్రైమరీ స్కూల్, జడ్పీహెచ్ఎస్ జమాండ్లపల్లి, జడ్పీహెచ్ఎస్ కంబాలపల్లి, యుపిఎస్ కొత్త రెడ్యాల, గడ్డి గూడెం యుపిఎస్ బ్రాహ్మణపల్లి యుపిఎస్ వేమునూర్ తదితర పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా టి పి టి ఎఫ్ జిల్లా కార్యదర్శి రాచకొండ ఉపేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై దాదాపు మూడు సంవత్సరాలైనా ఉద్యోగుల,ఉపాధ్యాయుల సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా ప్రభుత్వం పిఆర్సి నివేదికను తెప్పించుకొని వెంటనే అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్నఆరు డిఏలను వెంటనే మంజూరు చేయాలని కోరారు.రాజస్థాన్ పంజాబ్ చతిస్గడ్ ఝార్ఖండ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో సిపిఎస్ ను రద్దుచేసి ఆ ప్రభుత్వాలు మాట నిలబెట్టుకున్నాయని తెలంగాణలో కూడా సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. ఈ టిపిటిఎఫ్ మహబూబాబాద్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఘనపురం బిక్షపతి, సారెడ్డి రామలింగారెడ్డి, నాయకులు సజ్జనము వెంకటేశ్వర్లు, గునిగంటి శ్రీను, గుగులోత్ సరిరామ్, చిందం శ్రీనివాస్, భూక్య ప్రకాష్, పి సత్యనారాయణ, బండారి నరేష్, సిరికొండ నాగేశ్వరరావు, కొండ్లె రాము, చిత్రం మణిశర్మ తదితరులు పాల్గొన్నారు.