8న ఫీజు బకాయిలపై సత్యాగ్రహ దీక్ష
- : బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య
విశ్వంభర, హైదరాబాదు : రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి, పాత విధానాన్ని కొనసాగించాలి, జీవో నెం.9ను రద్దు చేయాలి, లేనిపక్షంలో ఈ నెల 8న ఇందిరాపార్క్ వద్ద వేలాది మందితో సత్యాగ్రహ దీక్ష నిర్వహిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య తెలిపారు. గురువారం హైదరాబాదు బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బీసీ విద్యార్తి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పగిళ్ల సతీష్, బిసి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి,ధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సంబంధించిన సుమారు రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రూ.8 వేల కోట్ల బకాయిలు ఉండగా రూ.300 కోట్లు మాత్రమే విడుదల చేయడం సమస్యకు పరిష్కారం కాదన్నారు. కొత్తగా తీసుకొచ్చిన జీవో నెం.9 ఆచరణ సాధ్యం కాదని, దానిని వెంటనే రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని కోరారు. విద్యార్థులు ముందుగా ఫీజులు చెల్లించి ప్రవేశాలు పొందే పరిస్థితి లేదని, పాత విధానంలో ఉన్న లోపాలను సరిదిద్ది విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల జరిగిన కాలేజీల బంద్‌కు విశేష స్పందన లభించిందని పేర్కొన్న ఆయన, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బకాయిలు విడుదల చేయాలని కోరారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఫీజు బకాయిల కారణంగా ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సులు పూర్తి చేసిన వేలాది మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అందడం లేదని, దీంతో ఉన్నత విద్య, ఉద్యోగాలు, విదేశీ విద్య, పోటీ పరీక్షల అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యాసంస్థలు కూడా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీ రాందేవ్, గుజ్జ కృష్ణ, నిఖిల్ పటేల్ ,సాయి, భీమ్ రాజు తదితరులు పాల్గొన్నారు.