ఖానాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు
On
విశ్వంభర, రంగారెడ్డి/ఖానాపూర్ :-రంగారెడ్డి జిల్లాలోని ఖానాపూర్ గ్రామం ప్రభుత్వ పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జెండా ఆవిష్కరణ అనంతరం విద్యార్థి విద్యార్థులకు స్వీట్లు బహుమతులు ప్రిన్సిపల్ మధుకర్ రెడ్డి అందజేశారు. ఈ గ్రామ మాజీ కౌన్సిలర్ అమరేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ రామేశ్వరం నరసింహ, సామాజిక కార్యకర్త కిషన్ పాల్గొన్నారు. అతిథులు మాట్లాడుతూ విద్యలో చక్కగా రాణించాలని విద్యార్థులకు కోరారు. విద్యార్థులకు చక్కటి విద్యను బోధించి భవిష్యత్తులో ఉన్నతంగా తీర్చిదిద్దేటట్టు బాధ్యతతీసుకోవాలని వారు గుర్తు చేశారు, ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, గ్రామస్తులు విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు



