గౌను గుర్తు చూపిస్తూ 4 వార్డ్ అభ్యర్థి మాధవి ప్రచారం
On
విశ్వంభర,సంస్థాన్ నారాయణపురం: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో నాలుగో వార్డు స్వతంత్ర అభ్యర్థి శికిలమెట్ల మాధవి ప్రభాకర్ గౌను గుర్తుకు ఓటు వేయాలని వార్డు లో ప్రచార నిర్వహించారు. గౌను డ్రెస్ తో ఇంటింటికి అభ్యర్థులను విన్నవించుకుని అత్యధిక మెజార్టీతో గౌన్ గుర్తుపై ఓటు వేసి మీ వార్డు మెంబర్ గా గెలిపించాలని కోరారు.వార్డు లో ఉన్న సమస్యలపై అనునిత్యం మీ వెంట ఉంటానని పేర్కొన్నారు. ప్రతి సమస్య నా సమస్య మీకు తోడుగా నిలబడతానని అన్నారు. వార్డులో ఉన్న డ్రైనేజీ ఇతర సమస్యలపై నేను మీకు తోడుగా ఉంటానని అన్నారు.



