పెనుయేలు సామాజిక సేవలు అభినందనీయం

పెనుయేలు సామాజిక సేవలు అభినందనీయం

  • మున్సిపల్ చైర్ పర్సన్ యెర్నేని కుసుమ 

విశ్వంభర, కోదాడ: కోదాడ నియోజకవర్గంలోని  పెనుయేలు వర్షిప్ సెంటర్స్ ఆర్గనైజేషన్  చేస్తున్న సామాజిక కార్యక్రమాలు అభినందనీయమని కోదాడ మున్సిపల్ ఛైర్ పర్సన్ యెర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు. కోదాడలోని పురమ రంగారావు ఫంక్షన్ హాల్ లో ఈస్టర్ పండుగ సందర్భంగా ఆదివారం రాత్రి నిర్వహించిన మున్సిపల్ చైర్ పర్సన్, మున్సిపల్ కౌన్సిలర్లకు ఆత్మీయ సన్మాన సభలో పాల్గొని ఆమె మాట్లాడారు. ఈస్టర్ పండుగను పురస్కరించుకొని పెనుయేలు సంస్థ వారు నిర్వహించిన ఆత్మీయ సన్మాన సభలో ఇటీవల నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్, మునిసిపల్ కౌన్సిలర్ లను పెనుయేలు సంస్థ ప్రధాన కార్యదర్శి ఎం. రాజేష్ దంపతులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పెనుయేలు సంస్థ వ్యవస్థాపకులు ఆర్చి బిషప్ జె. సుదర్శనం, అధ్యక్షులు బిషప్ జె జె సామ్యూల్ సన్, కోదాడ పట్టణానికి చెందిన బిషప్ డా కె జోసెఫ్, బిషప్ సీ.హెచ్. లూకా కుమార్, బిషప్ జి.ఆర్. అబ్రహాం, ఎం. రాముజెకర్యా, జె. దానియేలు, పెనుయేలు సంస్థలోని పాస్టర్లు, క్రైస్తవులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags: