నిరుపేదలకు అండగా గాంధీజీ ఫౌండేషన్   

 నిరుపేదలకు అండగా గాంధీజీ ఫౌండేషన్   

-నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన గాంధీజీ ఫౌండేషన్

- గాంధీజీ ఫౌండేషన్ వారి పదవ నెల సరుకుల పంపిణీ 

- ఏ ఆసరా లేని నిరుపేదలను ఆదుకోవడమే గాంధీజీ ఫౌండేషన్ ఆశయం -డాక్టర్ కోడి శ్రీనివాసులు దంపతులు..

విశ్వంభర, నల్గొండ జిల్లా, చండూర్ :  రెండు సంవత్సరముల వరకు ప్రతినెల 20 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకుల పంపిణీ చేయాలనే లక్ష్యంతో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు ఈ సంవత్సరం జనవరి నెల ఒకటో తేదీన ప్రారంభించిన గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో "నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ" కార్యక్రమం బుధవారం నాడు స్ధానిక గాంధీజీ విద్యాసంస్థల యందు పదవ నెల నిత్యావసర సరుకులను పంపిణీ చేసారు.  గాంధీ జయంతిని పురస్కరించుకొని గాంధీజీ విద్యాసంస్థల్లో ఉన్నటువంటి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి కోడి అరుణలు మాట్లాడుతూ మా జీవితం ఉన్నంతవరకు గాంధీజీ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీ చేయడంతో పాటు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ, సమాజంలో ఆదర్శవంతంగా జీవిస్తామని, ఏ ఆసరా లేని నిరుపేదలను ఆదుకోవడమే గాంధీజీ ఫౌండేషన్ ఆశయమని అన్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నామని, పేద విద్యార్థులకు స్కూల్ ఫీజులలో రాయితీని కల్పిస్తున్నామని తెలిపారు. ఆరోగ్యం సరిగాలేని నిరుపేదలకు మెడిసిన్ కొనుకొనుట కోసం ఆర్ధిక సహాయం అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో  గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపాల్ సత్యనారాయణమూర్తి, బోడ యాదయ్య, బుషిపాక యాదగిరి, గణేష్, బోడ విజయ్,గోపి తదితరులు పాల్గొన్నారు.

Tags: