సంక్రాంతికి స్టాలిన్ కానుక..!!

 సంక్రాంతికి స్టాలిన్ కానుక..!!

విశ్వంభర నేషనల్ బ్యూరో: తమిళనాడు ప్రజలకు సంక్రాంతి పండుగను మరింత ఆనందంగా మార్చేందుకు సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం భారీ పండుగ కానుకలను ప్రకటించింది.

విశ్వంభర నేషనల్ బ్యూరో: తమిళనాడు ప్రజలకు సంక్రాంతి పండుగను మరింత ఆనందంగా మార్చేందుకు సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం భారీ పండుగ కానుకలను ప్రకటించింది. మొత్తం రూ.6,936 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ప్రత్యేక సంక్రాంతి గిఫ్ట్ ప్యాక్‌ను ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఈ పథకం ద్వారా దాదాపు 2.22 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి.

ఈ సంక్రాంతి కానుకల్లో భాగంగా ప్రతి రేషన్ కార్డు కుటుంబానికి రూ.3,000 నగదు సహాయం అందిస్తున్నారు. దీనితో పాటు ఒక కిలో బియ్యం, ఒక కిలో చక్కెర, ఒక చెరకు గడను కూడా ఉచితంగా ఇస్తున్నారు. అంతేకాదు, కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మహిళలకు చీర, పురుషులకు ధోతి కూడా పంపిణీ చేస్తున్నారు. పండుగకు అవసరమైన అన్ని వస్తువులను ఒకే చోట అందించడం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొంది.

Read More దేవినేని చెతిన్ చక్రవర్తి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో  కమ్మ కార్పొరేషన్ చైర్మన్ కు గద్దె విజయ్ నేత ఘన సత్కారం. 

రేషన్ దుకాణాల వద్ద ఎలాంటి రద్దీ లేదా గందరగోళం తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేసింది. ప్రతి కుటుంబానికి ముందుగానే ఇంటింటికీ టోకెన్లు పంపిణీ చేశారు. ఆ టోకెన్‌లో సూచించిన తేదీ ప్రకారం జనవరి 12 వరకు సమీప రేషన్ దుకాణానికి వెళ్లి సంక్రాంతి కానుకలను తీసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. దీనివల్ల వృద్ధులు, మహిళలు, పిల్లలు ఇబ్బందులు పడకుండా సరుకులు పొందే అవకాశం ఏర్పడింది.

డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నది మరోసారి ఈ పథకంతో స్పష్టమవుతోంది. ముఖ్యంగా పండుగల సమయంలో ప్రజలకు నేరుగా ఉపయోగపడే విధంగా నగదు, నిత్యావసర వస్తువులు అందించడం ప్రశంసలు పొందుతోంది. అయితే, పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ స్థాయిలో సంక్రాంతి కానుకల పథకం అమలులో లేకపోవడం గమనార్హం. తమిళనాడులో అమలవుతున్న ఈ స్కీమ్‌పై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది.

Tags: