ఫ్రీగా హెచ్ వివి వ్యాక్సిన్

ఫ్రీగా హెచ్ వివి వ్యాక్సిన్

విశ్వంభర,నెల్లికుదురు:హెచ్ వివి వ్యాక్సిన్ ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలోని బిజెపి ప్రభుత్వం ఉచితంగా అందజేయడం మహిళలకు గొప్ప వరమని బిజెపి జిల్లా నేత నవీన్ నాయక్ అన్నారు. ఆయన మాట్లాడుతూ స్త్రీలకు గర్భాశయ క్యాన్సర్ తో పాటు ఇతర నాలుగు రకాల క్యాన్సర్ వ్యాధులను రాకుండా అడ్డుకునే వ్యాక్సిన్ ఒక్కోదానికి దానికి రూ.4 వేలు అవుతుందన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం సౌభాగ్యంగా ఉంటుందని భావించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఫ్రీగా ఇస్తోందని చెప్పారు. ఒక పెద్ద ప్రణాళికతో ప్రతి యువతి, ప్రతి మహిళకు ఆయా పిఎసిఎస్ ల ద్వారా వ్యాక్సినేషన్ చేయనున్నట్లు తెలిపారు.దేశ ప్రజల ఆరోగ్య రక్షణ కర్తవ్యంగా భావించి మోది కరోనా సమయంలో వ్యాక్సిన్ లు,ఉచిత బియ్యం, మందులు ఎప్పటికప్పుడు వేగంగా ఉచితంగా అందించడంతో కరోనా నుంచి ప్రజలను రక్షించిన విషయం గుర్తు చేశారు.

Tags: