ఇంద్రపాలనగరంలో ఘనంగా హోలీ
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, ఇంద్రపాలనగరం గ్రామంలో హోలీ వేడుకలను గ్రామ సర్పంచ్ గర్ధాసు విక్రమ్ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హోలీ సంబరాలలో పాల్గొన్న గర్ధాస్ విక్రమ్ సర్పంచ్ ఈ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ గ్రామ పెద్దలు, వివిధ పార్టీల నాయకులు, మహిళలు, యువకులతో చిన్నారులతో, వివిధ రంగులతో మోదుగు పూలతో హోలీ వేడుకలు ఘనంగా డీజే చప్పుళ్లతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప-సర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డు మెంబర్ వరికుప్పల స్వామి, యువ నాయకులు సింగనబోయిన గణేష్ యాదవ్, చిన్నపాక శ్రీనివాస్, సింగనబోయిన జంగయ్య, మందడి విధ్యాసాగర్ రెడ్డి, మందడి శ్రీధర్ రెడ్డి, కాటపల్లి సిద్ధమ్మ యాదయ్య, రేపాక సత్తయ్య, రాస వెంకటేష్, రవ్వ నర్సింహా, రాజన్నగారి రమేష్, మంటి లింగస్వామి, మంటి రమేష్, గోళ్లేపల్లి యాదయ్య, చిన్నపాక సురేష్, బొల్ల నర్సింహా, బొల్ల మచ్చి, కంబాలపల్లి శ్రీశైలం, నక్క వెంకటేష్, కొమ్మగోని సంజీవ, జిట్టబోయిన వెంకటేష్, బోనగిరి మధు, వెలిమినేటి నరేష్, బోనగిరి సంజీవ, గర్ధాస్ శ్రీకాంత్, గడ్డం సాయి, గర్ధాస్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.



