కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి 

కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి 

  • భారతీయ మజ్దూర్ సంఘ్ సభ

విశ్వంభర, పూణే : కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి, హర్యానా ప్యాటర్న్ ఆధారంగా కాంట్రాక్టర్ రహిత విధానాన్ని అమలు చేయాలి అని భారతీయ మజ్దూర్ సంఘ్ అఖిల భారత అధ్యక్షుడు ఎస్. మల్లేశం అన్నారు. మహారాష్ట్ర విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం 6వ త్రైవార్షిక మహాసభ పూణేలో నిర్వహించారు. సభకు రాజ్యసభ సభ్యురాలు మేధా కులకర్ణి, మహావితరణ డైరెక్టర్ (మానవ వనరులు) రాజేంద్ర పవార్ హాజరయ్యారు. సభలో మాట్లాడుతూ ఎస్. మల్లేశం, దేశవ్యాప్తంగా మినిమమ్ ఫ్లోర్ వేజ్ ప్రకటించాలని, పెన్షన్ నిధి పెంచాలని, ఈఎస్‌ఐసి అర్హత పరిమితిని రూ.21,000 నుండి రూ.42,000కు పెంచాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల శాశ్వతీకరణపై తక్షణ నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షుడు అడ్వొకేట్ అనిల్ ఢుమణే, పెండింగ్ సమస్యల పరిష్కారార్థం ఏప్రిల్ 16న ముంబై బాంద్రాలోని శ్రమాయుక్త కార్యాలయం వద్ద భారీ ఆగ్రహ ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ ర్యాలీలో రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు పాల్గొని డిమాండ్ల సాధన కోసం ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. మహాసభలో సుమారు 2,300 మంది కార్మికులు పాల్గొన్నారు. నూతన కాలానికి రాష్ట్ర అధ్యక్షుడిగా నీలేశ్ ఖరాత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సచిన్ మెన్గాలే ఎన్నికయ్యారు.

Tags: