మన్సూరాబాద్ వాకర్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో హొలీ వేడుకలు
విశ్వంభర, మన్సూరాబాద్: ఎల్‌బీ నగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్ లోని మన్సూరాబాద్ వాకర్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో మన్సూరాబాద్ పెద్ద చెరువు గ్రౌండ్ లో ఈ రోజు హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. మన్సూరాబాద్ వాకర్ అసోసియేషన్ హోలీ సంబరాలకు మధుర నగర్ వెల్ఫేర్, సరస్వతీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్స్ తదితర కాలనీవాసులు బ్యాండ్లతో వచ్చి హోలీ ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలలో వివిధ రకాల రంగులను చల్లుకొని హుషారైన డీజే సాంగ్స్ ఏర్పాటు చేసి పాటలకు అనుగుణంగా అంతాకలిసి కేరింతలు కొడుతూ స్టెప్పులు వేశారు. ఒకరికొకరు రంగులు చల్లుకొని, స్వీట్లు తినిపించుకొని హోలీ
శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్బంగా మన్సూరాబాద్ వాకర్స్ అసోషియేషన్ సభ్యులు మాట్లాడుతూ, ఈ హొలీ పండుగ కులమతాలకు అతీతంగా చిన్నా పెద్ద తేడాలేకుండా జరుపుకునే వేడుక అని అన్నారు. ఈ హోలీ వేడుకలో సీఐ జలంధర్ రెడ్డి, నాంపల్లి రామేశ్వర్, శేఖర్ రెడ్డి, కృష్ణ, కాశప్ప, భాస్కర్ రెడ్డి, బిక్షపతి, ఇజ్రాయిల్, నాగేశ్వర్ రెడ్డి, రత్నాకర్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, సత్యనారాయణ, రామకృష్ణ, వేణుగోపాల్ రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.



