మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం 

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం 

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, వెల్లంకి గ్రామానికి చెందిన ఆవనగంటి గోపాల్ (60) అనారోగ్యంతో మరణించగా, విషయం తెలుసుకున్న జిల్లా బిఆర్ఎస్ నాయకుడు ఎడ్ల మహేందర్ రెడ్డి 10 వేల  రూపాయలు, గ్రామ సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ 5,000 రూపాయలు, అవనిగంటి గోపాల్ కుమారుడైన ఆమనగంటి మహేష్ కు ఆర్థిక సాయం అందజేశారు.  ఈ సందర్భంగా ఎడ్ల మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, గోపాల్ మరణం చాలా బాధాకరమని, ఆవనగంటి మహేష్ కుటుంబానికి అన్ని విధాలుగా తాము అండదండగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప-సర్పంచ్ మిర్యాల రాజకుమార్, బిఆర్ఎస్ నాయకులు ఎడ్ల నరేందర్ రెడ్డి, ఈడెం శ్రీనివాస్, వార్డు సభ్యులు సండ్ల లింగయ్య, మరియు పాశం సతీష్ రెడ్డి, జింక శేఖర్, మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags: