చిలుక బీరకాయ..రంగుల మందారం
విశ్వంభర, ఇనుగుర్తి: రామచిలుక రూపంలో బీరకాయ, ఎప్పుడూ ఒకే రంగు పుష్పాలను పూసే మందారం రెండు రంగులతో వికసించిన అరుదైన ఉదంతం మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలో కనిపించింది. మండల కేంద్రం ఇనుగుర్తి కి చెందిన రైతు యంజాల కుమారస్వామి బీర తోటలో కాయలు తెంపుతున్న క్రమంలో అచ్చం రామచిలుక ను పోలిన బీరకాయ కనిపించింది. ముక్కు,నడుము భాగం,తోక సంబంధిత పక్షి ఆకారంలో ఉండడంతో రైతు ఆశ్చర్యపోయాడు. పలువురు దీనిని వింతగా చూశారు. అదే మండలం చిన్ననాగారంలోని జర్నలిస్టు బొలగాని యాకయ్య గౌడ్ ఇంటి ఆవరణంలోని మందారం మొక్క ఎప్పుడు ఒకే రంగులో పుష్పాలను పూసేది. మంగళవారం హోలీ రోజు అదే చెట్టు రెండు రంగుల పుష్పాన్ని వికసించింది.దీంతో యాకయ్య సుమలత దంపతుల తో పాటు కుటుంబ సభ్యులు,చుట్టుపక్కల వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మొక్కలలో హార్మోన్ల అసమతుల్యత వలన అప్పుడప్పుడు ఈ విధంగా జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి మహేందర్ తెలిపారు.



