మహేశ్వరంలో ఘనంగా హోలీ
On
విశ్వంభర, మహేశ్వరం :మహేశ్వరం మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్ ఆధ్వర్యంలో గ్రామంలో చిన్న పెద్ద తేడా లేకుండా అత్యంత వైభవంగా హోలీ పండుగ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ నవీన్ మాట్లాడుతూ, హోలీ అనేది హిందువుల పవిత్రమైన పురాతన సంప్రదాయం అని, ఇది హిందువులు, హిందువులు కానివారు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందించే సాంస్కృతిక వేడుక అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వార్డ్ మెంబర్స్ , మాజీ సర్పంచ్ లు, మాజీ ఉప సర్పంచ్ లు, మాజీ వార్డు సభ్యులు, దేవాలయ కమిటీ చైర్మన్, పి.ఎ.సి.ఎస్, మార్కెట్ కమిటీ, దేవాలయ కమిటీ డైరెక్టర్లు, మాజీ ఎంపిటిసిలు, ఆల్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.



