పిన్నింగ్ తో విరిగిన ఎముకలకు చికిత్స 

పిన్నింగ్ తో విరిగిన ఎముకలకు చికిత్స 

విశ్వంభర, కోదాడ: కోదాడ పట్టణం లో జంతు ప్రేమికుడి కుక్కని ఈ మధ్య పక్కింటి వ్యక్తి కర్రతో కొట్టడంతో ఎడమకాలి ఎముక  విరిగింది. ఒకసారి  సిమెంట్ కట్టు కట్టగా కాలు కింద నుండి తొడ వరకు వెళ్ళేసరికి వెడల్పు పెరిగి కట్టు జారిపోయింది. విరిగిన కాలు శస్త్ర చికిత్స కోసం వేరే ఆసుపత్రికి వెళ్లగా ఆపరేషన్ థియేటర్ ఖాళీగా లేక ఆపరేషన్ కి మూడు రోజుల సమయం పడుతుందని తెలిపారు. దానితో తిరిగి యజమాని కుక్కని ప్రాంతీయ పశువైద్యశాలకి తీసుకు వచ్చారు. విరిగిన  కాలుని పరీక్షించిన అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య , అక్కడ తీయించిన ఎక్స్ రే ఆధారంగా స్థానిక స్రవంతి ఆర్థోకర్ ఆసుపత్రిలో వాడగా మిగిలిన 3.5 యం యం పిన్ తీసుకొని ఆపరేషన్ లేకుండా విరిగిన కాలి ఎముకలోకి పిన్నింగ్ చేసి రెండు ఎముకలను అతికించారు. వేలల్లో ఖర్చు అవుతుందని భయపడి,పసరు కట్టుకోసం వెళ్దామని ఆలోచించగా పసరు కట్టు వద్దని ప్రాంతీయ పశువైద్యశాలకి కుక్కని తీసుకు వస్తే తాను ఇతర మార్గాల్లో కాలు అతికించడానికి ప్రయత్నిస్తానని  అసిస్టెంట్ డైరెక్టర్  తెలిపారు. అసలు ఖర్చే లేకుండా కుక్క కాలి ఎముకలను అతికించడం తో జంతు యజమాని సంతోషం వ్యక్తం చేశారు.

Tags: